శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (13:08 IST)

అందాలు ఆర‌బోస్తున్నా అవ‌కాశాలు రాని న‌టి!

naina benarjee
క‌రోనా వ‌ల్ల హీరోయిన్లు ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటూ త‌మ ప‌నుల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కొంద‌రైతే ఏకంగా యువ‌త‌ను రెచ్చ‌గొట్టేవిధంగా క్లిప్‌లు పెట్టి సినిమా అవ‌కాశాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయోన‌ని ఆలోచిస్తున్నారు. ఆ కోవ‌లోనే న‌టి మ‌ధురిమ చేరింది. ఎన్‌.టి.ఆర్‌. `టెంప‌ర్‌`లో చెల్లెలు పాత్ర‌ను పోషించిన మ‌దురిమ బాలీవుడ్‌లో న‌టి. ప‌లు యాడ్స్‌కూడా చేసిన అనుభ‌వం వున్న ఆమె బాలీవుడ్‌లోనైనా అవ‌కాశాలు ద‌క్కుతున్నాయోన‌ని భావించింది.
 
naina benarjee
తెలుగులో అల్లు శిరీష్‌తో `కొత్త‌జంట‌`లో  ఆ అంటే అమ‌లాపురం అంటూ ఆడి పాడింది. అయినా పెద్ద‌గా అవ‌కాశాలు ల‌భించ‌లేదు. లాభంలేద‌నుకుని బాలీవుడ్‌కు వెళ్ళింది. ఆమె అస‌లు పేరు నైరా బెన‌ర్జీ. అక్క‌డ ఏకంగా హాలీవుడ్ స్టార్ స‌న్నిలియోన్‌తో క‌లిసి న‌టించింది. `ఒన్ నైట్ స్టాండ్స్‌` అనే సినిమాలో రెండు పెగ్గులు వేసి హీరోతో లిప్‌కిస్‌, బెడ్‌సీన్‌లోనూ న‌టించి ర‌క్తిక‌ట్టించింది. ఆ త‌ర్వాత సోష‌ల్‌మీడియాలో ర‌క‌ర‌కాలుగా త‌న అందాల‌ను చూపిస్తుండేది. తాజాగా చీర‌క‌ట్టుతో వున్న ఫొటో పెట్టింది. దానికి మంచి స్పంద‌నే వ‌చ్చింది. అయినా అవ‌కాశాలు రావ‌డంలేదు. ఇక‌లాభంలేద‌ని ఓ వెబ్‌సిరీస్‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మైంది.