ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (16:37 IST)

రైట్స్ రూ.80 కోట్లు... పబ్లిసిటీకి రూ.10 కోట్లు.. లాభం రూ.285 కోట్లు : ఇది హిందీ బాహుబలి స్టామినా

బాలీవుడ్‌లో హిందీ బాహుబలి 2 చిత్రం నిర్మాతపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.కోట్లు కొల్లగొడుతోంది. అలాగే, మొత్తం నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సంచలన విజయాన

బాలీవుడ్‌లో హిందీ బాహుబలి 2 చిత్రం నిర్మాతపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.కోట్లు కొల్లగొడుతోంది. అలాగే, మొత్తం నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఫలితంగా గత చరిత్ర రికార్డులను తిరగరాస్తూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఇప్పటికే భారతీయ సినిమా రికార్డులు కనుమరుగైపోయాయి. ఇప్పటివరకు రూ.1200 కోట్ల క్లబుల్లో చేరిన ఏకైక సినిమాగా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' నెలకొల్పింది. 
 
ఈ చిత్రం హిందీ స్టార్ నిర్మాత కరణ్ జోహర్‌కు రూ.కోట్ల వర్షం కురిపించింది. గురువారం వరకు అందిన బాక్సాఫీసు లెక్కల ప్రకారం హిందీ బాహుబలి రూ.375.37 కోట్ల వసూళ్లు సాధించింది. నిజానికి 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా హిందీ హక్కులను దర్శక, నిర్మాత కరణ్ జోహర్ రూ.80 కోట్లకు కొనుగోలు చేశారు. సినిమా ప్రమోషన్ (పబ్లిసిటీ) కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ లెక్కన కరణ్ జోహార్ బాహుబలి కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.90 కోట్లు. 
 
కానీ, ఆయనకు 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా ఇప్పటికే రూ.285.37 కోట్ల లాభం తెచ్చిపెట్టింది. మరో పన్నెండు కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే ఈ సినిమా అమీర్ ఖాన్ 'దంగల్' సాధించిన రూ.387.38 కోట్ల రికార్డును తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. దటీజ్ దర్శకధీరుడు రాజమౌళి స్టామినా.