బోయపాటి అక్కడ ప్లాన్ చేసాడా..?

Balayya
శ్రీ| Last Modified శనివారం, 16 మే 2020 (12:45 IST)
ఊర మాస్ డైరెక్టర్ అంటే... ఠక్కున గుర్తుకువచ్చేది బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య, బోయపాటి సింహా, లెజెండ్ చిత్రాలు చేయడం.. ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ కావడంతో తాజా చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తుండడంతో ఆ రెండు పాత్రలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి ఏర్పడింది. అయితే... బాలయ్య ఇందులో అఘోరా పాత్ర పోషిస్తున్నారు అనే టాక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.

కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో.. ఈ సినిమా స్ర్కిప్ట్‌లో మార్పులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే... లాక్ డౌన్ తీసిన తర్వాత వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకున్నప్పటికీ ఆర్టిస్టుల డేట్స్... లోకేషన్స్ సెట్ చేసుకోవడానికి టైమ్ పడుతుంది కాబట్టి ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకపోవచ్చు అని తెలిసింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఈ సినిమా షూటింగ్‌ను హిమాలయాల్లో ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. బాలయ్య అఘోరా పాత్ర పోషిస్తున్నారు కాబట్టి... అఘోరా పాత్రకు సంబంధించిన సన్నివేశాలను హిమాలయాల్లో చిత్రీకరించాలి అనుకుంటున్నారని తెలిసింది. బాలయ్య అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి.. అందరి అంచనాలకు తగ్గట్టుగా బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ సాథిస్తారో లేదో చూడాలి.
దీనిపై మరింత చదవండి :