శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 6 మే 2020 (19:07 IST)

బాలయ్యతో రామారావు - చైతుతో నాగేశ్వరావు (video)

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
తాజా వార్త ఏంటంటే.. బాలయ్యతో సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా చేయనున్నట్టు తెలిసింది. గత కొంతకాలంగా బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా అంటూ వార్తలు వచ్చాయి.
 
ఇప్పుడు ఈ సినిమా కన్ఫర్మ్ కానుందని టాక్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 స్ర్కిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. 
 
ఈ సినిమా తర్వాత బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని.. దీనికి రామారావు అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు చైతన్యతో నాగేశ్వరరావు అనే సినిమా ప్లాన్ చేస్తుండటం విశేషం.

అవును.. చైతన్యతో గీత గోవిందం సినిమా డైరెక్టర్ పరశురామ్ నాగేశ్వరరావు అనే సినిమా చేయనున్నారు. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించనుంది. ఏది ఏమైనా.. తెలుగు సినిమాకి రెండు కళ్లు అయిన రామారావు, నాగేశ్వరరావు పేర్లతో సినిమాలు రూపొందుతుండటం విశేషం.