మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (12:53 IST)

అనసూయ, రేష్మి- బ్రహ్మీల కాంబోలో త్రివిక్రమ్ సినిమా.. ప్రిన్స్‌తో కూడా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి హిట్ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. నితిన్, సమంతల కాంబోలో అఆ చేసినా మంచి కలెక్షన్స్ సాధించలేకపోవడంతో.. బ్రహ్మానందం-రష్మీ- అనసూయల కాంబోలో ఓ సినిమాకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్త

త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి హిట్ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. నితిన్, సమంతల కాంబోలో అఆ చేసినా మంచి కలెక్షన్స్ సాధించలేకపోవడంతో.. బ్రహ్మానందం-రష్మీ- అనసూయల కాంబోలో ఓ సినిమాకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ముగ్గురి కాంబోలో సినిమా చేస్తే తప్పకుండా సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని.. కలెక్షన్ల వర్షం కురుస్తుందని టాక్. 
 
కానీ ఈ చిత్రానికి దర్శకత్వ పగ్గాలను మాత్రం త్రివిక్రమ్ కొత్త వాళ్లకు అప్పగించి నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. అయితే దర్శకత్వం మాత్రం త్రివిక్రమ్ కనుసన్నల్లోనే జరుగుతుందని సినీ వర్గాల సమాచారం. ముందుగా ఈ సినిమాకు బ్రహ్మానందం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని వార్తలొచ్చాయి. కానీ దర్శకత్వంతో తలనొప్పి ఎక్కువని సన్నిహితులు చెప్పడంతో బ్రహ్మీ ఈ సినిమా డైరక్షన్‌ను వదులుకున్నట్లు తెలిసింది. 
 
కాగా.. అ.. ఆ.. సినిమా తర్వాత నాని, శర్వానంద్, రామ్, మంచు ఫ్యామిలీ హీరోలు త్రివిక్రమ్‌తో చేయాలని ట్రై చేశారు. కానీ మాటల మాంత్రికుడు వాళ్లెవరికీ సరేననలేదు. వీళ్లు మాత్రమే కాదు. త్రివిక్రమ్‌తో చేయాలని పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్ టీఆర్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు, పవన్ కల్యాణ్‌కు కూడా త్రివిక్రమ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 
 
వీరందరికీ త్రివిక్రమ్ నో చెప్పేశాడని.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్. మహేశ్ బాబుతో మైత్రీ మూవీస్ బ్యానర్‌పై త్రివిక్రమ్ సినిమా ఉండనుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. మురుగదాస్ సినిమా పూర్తయ్యాక.. త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.