1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 7 జులై 2016 (10:07 IST)

అల్లు శిరీష్ సినిమాలో అల్జు అర్జున్.. మల్లిడి వేణుతో ఉన్న అనుబంధమే కారణం..?!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ''సరైనోడు'' హిట్‌తో మాంచి ఊపుమీదున్నాడు. ''రేసుగుర్రం'' దగ్గర్నుండి ''సరైనోడు'' వరకు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కాని బన్నీసోదరుడు అల్లు శిరీష్ మాత్రం సరైన హిట్లులేక స

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ''సరైనోడు'' హిట్‌తో మాంచి ఊపుమీదున్నాడు. ''రేసుగుర్రం'' దగ్గర్నుండి ''సరైనోడు'' వరకు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కాని బన్నీసోదరుడు అల్లు శిరీష్ మాత్రం సరైన హిట్లులేక సతమతమవుతున్నాడు. అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీరస్తు శుభమస్తు ద్వారా తన అదృష్టాన్నిపరీక్షించుకోనున్నాడు. అంతేకాకుండా మరో చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు వారబ్బాయి. 
 
మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడు ఇటీవల అల్లు అరవింద్‌ని కలిసి కథను వినిపించగా వెంటనే ఒప్పేసుకున్నాడట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...అల్లు శిరీష్ హీరోగా నటిస్తోన్న సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించడానికి బన్నీ సిద్ధమయ్యాడు. డైరెక్టర్ మల్లిడి వేణుతో ఉన్న అనుబంధంకూడా అతిథి పాత్రలో నటించడానికి మరో కారణమట. 
 
గతంలో అల్లు అర్జున్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'బన్నీ' చిత్రాన్ని మల్లిడి వేణు తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. అప్పటినుండే అల్లు అర్జున్‍‌కి ఆ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందుకే స్పెషల్ అప్పియరెన్స్‌కు సై అంటున్నాడు. 
 
అయితే అల్లు అర్జున్ ఒప్పుకోవడానికి ఒక కారణం తన తమ్ముడైతే మరొకటి మల్లిడి వేణు తండ్రి సత్యనారాయణ రెడ్డి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే అల్లు బ్రదర్స్ ఇద్దరూ ఒకేతెరపై కనిపించే సినిమా కావడంతో డైరెక్టర్ స్క్రిప్ట్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.