మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (11:20 IST)

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజకు మళ్లీ పెళ్లి.. వరుడు ఎవడు?

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. చిరంజీవి - సురేఖల రెండో కుమార్తె శ్రీజకు మళ్లీ పెళ్లి చేయాలని మెగా ఫ్యామిలీ సభ్యులు నిర్ణయించారు. నిజానికి శ్రీజ గతంలో శిరీష్‌ భరద్యాజ్‌ అనే కుర్రాడిని ప్రేమించి, ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. నిజానికి ఈ వివాహం మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరికీ ఇష్టం లేకున్నా... ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ వారి ప్రేమ వివాహం ఎంతో కాలం నిలబడ లేదు. ఒక పాప పుట్టాక శ్రీజ తనతో ఉండలేనంటూ.. కోర్టుని ఆశ్రయించి భరద్వాజ్‌ నుంచి విడాకులు తీసుకుంది. 
 
అనేక విచారణల తర్వాత వీరివురికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం శ్రీజ అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. శ్రీజ విడాకులు తీసుకుని చాలా కాలం కావొస్తుంది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేయాలని మెగా కుటుంబం నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. ఇంకా ఎంత కాలం ఇలా ఒంటరిగా ఉంటావంటూ మెగా కుటుంబం ఆమెకు నచ్చజెప్పి ఈ పెళ్లికి ఒప్పించినట్టు వార్తలు. 
 
ఇందుకు శ్రీజ కూడా అంగీకారం తెలపడంతో ఎంతో గోప్యంగా పెళ్లి కొడుకుని వెతకడం, ఎంగేజ్‌‌మెంట్‌ కూడా జరపడం పూర్తైందట. శ్రీజను చేసుకోబోయే వాడు అమెరికాలో పలు వ్యాపారాలు చేస్తూ.. అక్కడే స్థిరపడినట్టు సమాచారం. అన్నీ అనుకూలంగా జరిగితే వీరి వివాహం త్వరలోనే జరుగనుంది. అంటే త్వరలోనే మెగాస్టార్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయన్నమాట.