గురువారం, 13 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (18:02 IST)

పూజాహెగ్డే బ్యాట్‌మెన్‌లా వేలాడుతూ ఫోటోలు దిగింది.. అవకాశాల కోసం నానా తంటాలు?

తెలుగులో 'ఒక లైలా కోసం', 'ముకుంద', చిత్రాలతో అలరించి తాజాగా 'మొహెంజొదారో'లో హృతిక్‌రోషన్‌ సరసన చానీగా ఆకట్టుకున్న నటి పూజాహెగ్డే ప్రస్తుతం కొత్త కొత్త విన్యాసాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా బ్య

తెలుగులో 'ఒక లైలా కోసం', 'ముకుంద', చిత్రాలతో అలరించి తాజాగా 'మొహెంజొదారో'లో హృతిక్‌రోషన్‌ సరసన చానీగా ఆకట్టుకున్న నటి పూజాహెగ్డే ప్రస్తుతం కొత్త కొత్త విన్యాసాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా బ్యాట్‌మెన్‌లా వేలాడుతూ ఫొటోదిగి అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్‌ సరసన 'దువ్వాడ జగన్నాథ్‌' చిత్రంలో కథానాయికగా అలరించబోతోన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌ మగధీర రీమేక్‌లో మిత్రవిందగా నటించనుంది. 
 
తెలుగు సూపర్ హిట్ మూవీ ‘మగధీర’ అఫీషియల్ రీమేక్‌లో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. హిందీ మగధీరలో ఇప్పటికే షాహిద్ కపూర్ హీరోగా ఫైనలైజ్ అయ్యాడు. అయితే పూజా హెగ్డే మగధీర బాలీవుడ్ రీమేక్‌లో నటిస్తుందా లేదా అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎన్నో ఆశలతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పూజా హెగ్డేకు తొలి సినిమా మొహంజొదారో ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బొర్లా పడటంతో అవకాశాల కోసం నానా తంటాలు పడుతోంది. మరి పూజా ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.