ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 మే 2017 (13:14 IST)

'నువ్వా నేనా' అంటున్న దంగల్ - బాహుబలి : బాహుబలిని బీట్ చేయనున్న దంగల్ ఎలా..?

బాలీవుడ్ చిత్రం 'దంగల్'.. టాలీవుడ్ చిత్రం 'బాహుబలి'. ఈ రెండు చిత్రాలు నువ్వానేనా అంటున్నాయి. అదేంటి.. బాహుబలి చిత్రం ముందు అన్ని భారతీయ చిత్రాల రికార్డులు పటాపంచలై పోయాయి కదా? అన్నదే కదా మీ సందేహం. ని

బాలీవుడ్ చిత్రం 'దంగల్'.. టాలీవుడ్ చిత్రం 'బాహుబలి'. ఈ రెండు చిత్రాలు నువ్వానేనా అంటున్నాయి. అదేంటి.. బాహుబలి చిత్రం ముందు అన్ని భారతీయ చిత్రాల రికార్డులు పటాపంచలై పోయాయి కదా? అన్నదే కదా మీ సందేహం. నిజమే... అది నిన్నటి వరకు. ఇపుడు దంగల్ చిత్రం మళ్లీ పోటీలోకి వచ్చింది. దీంతో ఈ రెండు చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఎలాగో ఇపుడు తెలుసుకుందాం. 
 
గత నెల 28వ తేదీన రిలీజైన 'బాహుబలి'.. తెలుగు సినీ ప్రతిష్టను పెంచుతూ 1500 కోట్ల క్లబ్‌లో చేరింది. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. 'దంగల్' చిత్రం భారత్‌లో 744 కోట్ల రూపాయలు వసూలు చేయగా... 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ఏకంగా 1500 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. 
 
ఈ క్రమంలో 'దంగల్' చిత్రాన్ని చైనీస్ బాషలోకి అనువదించి ఈనెల ఐదో తేదీన రిలీజ్ చేశారు. అక్కడ ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తోంది. కేవలం 17రోజుల్లో 'దంగల్' చైనాలో 740 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా కలెక్షన్ల రేస్‌లోకి మళ్లీ వచ్చింది. భారత్ చైనాల్లో కలిపి దంగల్ రూ.1501 కోట్లు వసూలు చేయగా, 'బాహుబలి-2: ది కన్‌క్లూజన్' సినిమా రూ.1538 కోట్ల వసూళ్లు సాధించింది. చైనాలో అద్భుత విజయం సాధించిన దంగల్ 'బాహుబలి-2: ది కన్‌క్లూజన్' వసూళ్లను దాటడం సులభమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.