శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2016 (10:39 IST)

వారిద్దరితో లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే.. డ్యాన్స్ చేస్తా : దీపికా పదుకొణె

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ నటి దీపిక పదుకొణె ఇటీవల హాలీవుడ్‌ చిత్రం ''ట్రిపులెక్స్''’ షూటింగ్‌ పూర్తిచేసుకుని భారత్‌కి తిరిగి వచ్చేసింది. ఈ చిత్రం తర్వాత తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ నటి దీపిక పదుకొణె ఇటీవల హాలీవుడ్‌ చిత్రం ''ట్రిపులెక్స్''’ షూటింగ్‌ పూర్తిచేసుకుని భారత్‌కి తిరిగి వచ్చేసింది. ఈ చిత్రం తర్వాత తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ''పద్మావతి'' స్క్రిప్ట్‌ గురించి దీపికతో మాట్లాడటం ఆమె ఒప్పుకోవడం కూడా జరిగిపోయింది. అయితే ఈ సినిమాకి గానూ దీపిక 9 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్‌ చేసినట్లు బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 
 
హాలీవుడ్‌ ఎంట్రీ తర్వాత బాలీవుడ్‌లో దీపిక చేస్తున్న మొదటి చిత్రం కావడంతో పారితోషికం పెంచేసినట్లు బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలావుంటే... ఈ హాట్ బ్యూటీకి దీపికకి తీరని కల ఒకటుందట. అదేంటంటే.. లెజెండరీ నిర్మాత యశ్‌చోప్రాతో కలిసి నటించాలన్నది ఆమె కల. యశ్‌చోప్రాతో కలిసి పనిచేయాలనుకున్నాననీ అది తీరలేదని దీపిక ఫిలింఫేర్‌ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 
 
మీరు రణ్‌బీర్‌కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌లతో కలిసి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే ఏంచేస్తారు అని అడిగి వాఖ్యత అడిగిన ప్రశ్నకి.. ఇద్దరూ బెస్ట్‌ డ్యాన్సర్లు. కాబట్టి వారిద్దరి మధ్య నేను డ్యాన్స్‌ చేస్తాను అని చెప్పింది. మరి అందులో కత్రినాకైఫ్‌, అనుష్క శర్మ ఉంటే ఏం చేస్తారని అడిగితే.. బొమ్మరిల్లు ఆట ఆడుకుంటూ.. మంచి వంటకాలు వండి ఫ్రెండ్స్‌ అందరినీ పిలుస్తా అని తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది దీపిక.