శుక్రవారం, 18 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (09:48 IST)

నాగార్జున బర్త్‌డే... 'ఓం నమో వెంకటేశాయ' ఫస్ట్ లుక్ రిలీజ్ టుడే

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్న చిత్రం ''ఓం నమో వెంకటేశాయ''. అక్కినేని నాగార్జున కథనాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.ర

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్న చిత్రం ''ఓం నమో వెంకటేశాయ''. అక్కినేని నాగార్జున కథనాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ''అన్నమయ్య'', ''శ్రీరామదాసు'', ''శిరిడి సాయి'' చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.
 
ఓ వైపు కమర్షియల్‌ సినిమాలు మరోవైపు భక్తిరస సినిమాలు చేస్తూ నాగార్జున బిజీబిజీగా ఉన్నాడు. ఇంకోవైపు కుర్రహీరోలతో చిన్న బడ్జెట్‌ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనదైన శైలిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను అత్యంత వైభవంగా రూపొందిస్తున్నారు. ఇందులో వేంకటేశ్వరస్వామిగా బాలీవుడ్ హీరో సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తోంది. 
 
కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా సోమవారం అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా హాథీరామ్‌ బాబాగా ఉన్న ఆయన ఫస్ట్‌లుక్‌‌ను యూనిట్ సభ్యులు విడుదలచేశారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం అభిమానులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో వేచి చూడాలి.