శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (11:14 IST)

సంపత్ నంది చిత్రంలో ద్విపాత్రాభినయంలో గోపీచంద్.. ముగ్గురు హీరోయిన్లు!

''ఆక్సిజన్'' మూవీలో నటస్తూ బిజీ బిజీగా ఉన్న గోపిచంద్, ఈ సినిమా అనంతరం దర్శకుడు సంపత్ నంది డైరక్షన్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుత

''ఆక్సిజన్'' మూవీలో నటస్తూ బిజీ బిజీగా ఉన్న గోపిచంద్, ఈ సినిమా అనంతరం దర్శకుడు సంపత్ నంది డైరక్షన్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, ఇందులో గోపిచంద్ డ్యూయల్ రోల్‌లో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గోపిచంద్ డ్యూయల్ రోల్‌లో నటించడం ఇదే మొదటిసారి. 
 
ఈ సినిమాలో గోపిచంద్ సరసన ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆ ముగ్గురు హీరోయిన్లలో ఇప్పటికే రాశిఖన్నా, కేథరిన్ ఎంపిక అవ్వగా మూడో హీరోయిన్ కోసం ఇంకా యూనిట్ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. ఈ సినిమాకు పుల్లారావు, భగవాన్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలుస్తాయి.