సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (21:15 IST)

బాయ్‌ఫ్రెండ్‌తో బీచ్‌లో ముద్దులు.. గుప్పెడంత మనసు స్టార్ జ్యోతిరాయ్?

Jyothi Rai
Jyothi Rai
తెలుగు తెరపై ఇతర భాషలకు చెందిన పలువురు నటీమణులు సందడి చేస్తున్నారు. కానీ, వీరిలో చాలా కొద్దిమంది మాత్రమే భారీ ఫాలోయింగ్‌ను తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో 'గుప్పెడంత మనసు' ఫేమ్ జ్యోతిరాయ్ ఒకరు. చాలా కాలంగా నటిగా తన సత్తా చాటుతున్న ఈ భామ.. ఇప్పుడు ఎన్నో అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. 
 
ముఖ్యంగా జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ రొమాంటిక్ పిక్‌ని షేర్ చేసింది. కన్నడ బామ జ్యోతి రాయ్ మొదట మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ రంగంలో తనదైన గ్లామర్‌తో మాయ చేసింది. ఈ క్రమంలో ‘బందె బరతావ కాలా’ అనే సీరియల్ ద్వారా నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత అదే భాషలో చాలా సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తమిళం, తుళు భాషల్లో పలు సీరియల్స్‌లో నటించి పాపులర్‌ అయింది.
 
సౌత్ ఇండియాలో సీరియల్ నటిగా సంచలనం సృష్టించిన జ్యోతిరాయ్ చాలా ఏళ్ల క్రితం ‘కన్యాదానమ్’ సీరియల్‌తో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘గుప్పెడంత మనసు’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
ఇందులో జగతి పాత్రలో నటించి విపరీతమైన పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకుంది. చాలా కాలంగా నటిగా తన సత్తా చాటుతున్న జ్యోతిరాయ్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా బీచ్‌లో అబ్బాయితో విపరీతమైన రొమాన్స్ చేస్తూ.. గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతి రాయ్ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

అసలు విషయం ఏమిటంటే.. తాజాగా తన కొత్త వెబ్‌ సిరీస్ 'నో మోర్ సీక్రెట్స్'‌లో జగతి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. దీంట్లో బీచ్ ఒడ్డున చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఎవరికో లిప్ కిస్ ఇస్తుంది జ్యోతి. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వెబ్ సిరీస్ డిటైల్స్ షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
నో మోర్ సీక్రెట్స్ వెబ్ సిరీస్‌లో తన ఫస్ట్ లుక్ షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో రాబోతుందని వెల్లడించింది. 
Jyothi Rai
Jyothi Rai