శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : గురువారం, 17 జులై 2014 (10:41 IST)

సెట్‌లో చిన్నపిల్లలున్నారు.. డ్యాన్స్ ఎలా చేసేది : సన్నీ లియోన్

అమెరికా నుంచి దిగుమతి బాలీవుడ్‌కు దిగుమతి అయిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్. ఈ ముద్దుగుమ్మ నటించే చిత్రాలు కేవలం పెద్దలకు మాత్రమే అయినప్పటికీ.. తాను అలాంటి చిత్రాల్లో నటించేటపుడు కొన్ని నియమనిబంధనలు పాటిస్తోంది. తాజాగా ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. 
 
సన్నీ లియోన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హేట్‌స్టోరి 2’. ఇందులో సన్నీలియోన్‌తో ఓ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ముంబైలోని ఓ స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. అయితే... లొకేషన్లో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారట. అప్పటిదాకా డాన్స్‌లో నిమగ్నమైన సన్నీకి ఉన్నట్లుండి ఆ పిల్లలు కంట పడ్డారు. అంతే... పెద్దగా కేక వేయడంతో లొకేషన్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. 
 
ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత సన్నీ తేరుకొని, ‘‘ముందు ఆ పిల్లల్ని బయటకు పంపేయండి. నేను చేస్తోంది ఐటమ్‌సాంగ్. వారి ముందు అలా చేస్తే ఎలా? నాకు చాలా ఇబ్బందిగా ఉంది’’ అనేసిందట. వెంటనే... ప్రొడక్షన్ వాళ్లు అప్రమత్తమై పిల్లల్ని బయటకు పంపేశారట. పోర్న్ సినిమాల్లో నటించిన సన్నీ ఇలా విలువలు పాటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దటీజ్ సన్నీ లియోన్.