మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 17 జనవరి 2017 (15:53 IST)

వదిలేసిన పెళ్లాం కొంగు పట్టుకుని తిరుగుతున్న హీరో...

బాలీవుడ్ సెలబ్రిటీల విడాకులు తీసుకోవడం మరొకర్ని పెళ్లి చేసుకోవడం మామూలే. తాజాగా దీనికి భిన్నంగా ఓ బాలీవుడ్ కపుల్ వ్యవహరిస్తోందట. ఇంతకీ వాళ్లెవరయ్యా అంటే... హృతిక్ రోషన్, సుజానే. వీళ్లద్దరిదీ ప్రేమ పెళ్లి. హృతిక్ రోషన్ తన చిన్ననాటి స్నేహితురాలైన సుజాన

బాలీవుడ్ సెలబ్రిటీల విడాకులు తీసుకోవడం మరొకర్ని పెళ్లి చేసుకోవడం మామూలే. తాజాగా దీనికి భిన్నంగా ఓ బాలీవుడ్ కపుల్ వ్యవహరిస్తోందట. ఇంతకీ వాళ్లెవరయ్యా అంటే... హృతిక్ రోషన్, సుజానే. వీళ్లద్దరిదీ ప్రేమ పెళ్లి. హృతిక్ రోషన్ తన చిన్ననాటి స్నేహితురాలైన సుజానేని ప్రేమించి పెళ్లాడాడు. ఐతే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏమైందో తెలియదు కానీ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పిల్లల పుట్టినరోజు వేడుకల సమయంలో ఇద్దరూ మొక్కుబడిగా కలుసుకుంటూ వస్తున్నారు. 
 
ఐతే ఇలా కలుసుకుంటూ ఉన్నప్పుడు ఏవో కొత్తకొత్త అలజడులు కలుగుతున్నాయట ఇద్దరిలోనూ. చిన్ననాటి జ్ఞాపకాలు తొంగిచూస్తున్నాయట. దానితో పిల్లల పుట్టినరోజులప్పుడే కాకుండా వారివారి పుట్టినరోజులు వచ్చినప్పుడు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారట. వీరి వ్యవహారం చూస్తుంటే మళ్లీ పెళ్లి చేసుకుంటారేమోనని బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ప్రేమంటే ఇదే కదూ... దగ్గరున్నప్పుడు తెలియదు మరీ... దూరంగా జరిగినప్పుడే తన్నుకొస్తుంటుంది మరీ మరీ...