సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (08:56 IST)

పూరీ 'డ్రగ్' గుట్టు విప్పిన సినిమాటోగ్రాఫర్ ... చార్మీ ఎలాంటిదంటే...!?

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్ గుట్టు రట్టు అయింది. పూరీ తీసిన చిత్రాల్లో 17 సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన శ్యామ్ కె నాయుడు పూరీ మత్తుమందు బాగోతాన్ని తేటతెల్లం చేసినట్టు సమాచారం. పూరీ బెస్ట

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్ గుట్టు రట్టు అయింది. పూరీ తీసిన చిత్రాల్లో 17 సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన శ్యామ్ కె నాయుడు పూరీ మత్తుమందు బాగోతాన్ని తేటతెల్లం చేసినట్టు సమాచారం. పూరీ బెస్ట్ ఫ్రెండ్ చార్మీతో పాటు మరికొందరికీ పూరీ జగన్నాథ్ మత్తు మందు సరఫరా చేసేవాడనీ వెల్లడించినట్టు వినికిడి. అయితే, ఈ డ్రగ్‌ను డబ్బులకు అమ్మేవాడు కాదనీ, కేవలం స్నేహితులన్న అభిమానంతోనే పంపిణీ చేసేవాడనీ ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట వెల్లడించినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో పూరీ జగన్నాథ్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. 
 
సిట్ అధికారుల ముందు శ్యామ్ కె నాయుడు గురువారం ఉదయం హాజరుకాగా, ఐదు గంటల పాటు ఆయన వద్ద విచారణ జరిపారు. ఈ విచారణలో ఆనేక విషయాలను ఆయన బహిర్గతం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా 'ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ డ్రగ్స్‌ను వినియోగిస్తున్నప్పుడు చూశాను. నటి చార్మి, సినీ రంగంలోని ఇతరులకు ఆయన డ్రగ్స్‌ ఇస్తున్న విషయం కూడా తెలుసు' అని ఈ సినిమాటోగ్రాఫర్‌ చెప్పినట్టు వినికిడి. అయితే, హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో అరెస్టు అయిన ప్రధాన సూత్రదారి కెల్విన్‌ ఎవరో తనకు తెలియదని, పూరీకి డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తనకు తెలియదని చెప్పినట్లు కొన్ని వర్గాల సమాచారం. 
 
కాగా డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ అధికారులు నోటీసులు పంపించిన 12 మందిలో శ్యాం ఒకరు. పూరి డైరెక్ట్‌ చేసిన దాదాపు 17 సినిమాలకు శ్యాం కెమెరామన్‌గా పని చేశారు. పూరి డ్రగ్స్‌ వినియోగానికి సుదీర్ఘకాలంగా ఆయన వద్ద పని చేస్తున్న శ్యాం ప్రత్యక్ష సాక్షి అన్న అనుమానంతో ఆయనను విచారించారు. డ్రగ్స్‌ వినియోగం, సరఫరా, విక్రయం వంటి విషయాల్లో పూరికి సంబంధంపై ఆరా తీశారు. పూరితో స్నేహం కొనసాగిస్తున్నందున శ్యాం కూడా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడా అన్న కోణంలో అనుమానించి, విచారించారు.