శనివారం, 16 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (15:02 IST)

డ్రగ్ స్కామ్‌ : మరో వారం రోజుల్లో పూరీ జగన్నాథ్ అరెస్టు?

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్ స్కామ్‌లో టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అరెస్టు కావడం తథ్యమనే సంకేతాలు వస్తున్నాయి. అదీ కూడా వచ్చే శనివారంలోగా ఆయన అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని సిట్ వర్గాలు పేర్కొం

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్ స్కామ్‌లో టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అరెస్టు కావడం తథ్యమనే సంకేతాలు వస్తున్నాయి. అదీ కూడా వచ్చే శనివారంలోగా ఆయన అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసు మొత్తం ఇప్పటివరకూ పూరీ చుట్టే తిరుగుతూ ఉండటం, ఇతరులకు పంపిణీ చేశాడనటానికి పక్కాగా ఆధారాలు లభించడమే ఆయన అరెస్ట్‌కు దారితీయనుందని తెలుస్తోంది. 
 
ఇక పూరీ స్వయంగా డ్రగ్స్ తీసుకుంటాడని అనుమానిస్తున్న సిట్ ఇప్పటికే ఆయన వద్ద తొలి రౌండ్ విచారణ పూర్తి చేసింది. అలాగే, రక్తం, వెంట్రుకలు తదితర నమూనాలను ఎఫ్ఎస్ఎల్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో పూరీ డ్రగ్స్ వాడుతున్నట్టు వెల్లడైతే, ఈ కేసులో అది బలమైన సాక్ష్యంగా మారుతుందని సిట్ భావిస్తోంది. పూరీ జగన్నాథ్ తెప్పించే డ్రగ్స్‌ను తనతో పాటు చార్మీ, ముమైత్ ఖాన్‌లకు ఇచ్చేవాడని సుబ్బరాజు స్వయంగా వెల్లడించడంతో ఇక అరెస్ట్ తప్పదని సమాచారం. 
 
కాగా, పూరీ జగన్నాథ్‌ను విచారించిన రోజే, కేసులో ముఖ్యమైన వ్యక్తి అతనేనని, అరెస్ట్ జరుగుతుందని వార్తలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందనుకున్న విచారణ రాత్రి 9 గంటల వరకూ సాగింది. అప్పుడే పూరీని అరెస్ట్ చేస్తారని భావించినా, ఆ రోజుకు ఆయన్ను విడిచిపెట్టారు. ఇపుడు ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం సిట్ అధికారులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.