బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (14:30 IST)

పెళ్లి దుస్తుల్లో ఇలియానా.. ఆండ్రూతో వివాహమైపోయిందా? (video)

పోకిరి హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం ఆఫర్లు లేకుండా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో సహజీవనం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వుంటున్న ఇలియానా ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన దుస్తుల్లో మెరిసింది. ఇంకా పెళ్లికి సంబంధించిన దుస్తులతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
ఈ  ఫోటోలను చూసినవారంతా ఆండ్రూతో ఇలియానాకు రహస్య వివాహం జరిగిపోయిందని అనుకుంటున్నారు. ఇంకా ఈ ఫోటోలను చూపిస్తూ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఇలియానా ఈ వార్తలపై నోరు విప్పలేదు. 
 
కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ఇలియానా.. ప్రస్తుతం సినిమాల్లేకుండా ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయింది. ఉన్నట్టుండి ఆమె వివాహం చేసుకుందని.. గర్భంగా వుందని కూడా ప్రచారం సాగింది. 
 
ఆపై టాలీవుడ్‌లో రవితేజతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వెడ్డింగ్ అఫైర్ అనే మ్యాగజైన్‌కు ఫోటో షూట్ జరిగింది. దీనికోసమే ఇలియానా పెళ్లికూతురుగా ముస్తాబై ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.