సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (09:08 IST)

సినీ ఇండస్ట్రీ చాలా క్రూరమైనది... ఆ దర్శకులు అలా వాడుకున్నారు..

గోవా బ్యూటీ ఇలియానా సినీ ఇండస్ట్రీపై సంచలన విమర్శలు గుప్పించింది. ఈ వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకపుడు అగ్ర హీరోయిన్‌గా కొనసాగిన ఇలియానా... గత కొంతకాలంగా సినీ అవకాశాలు లేక ఇంటికే పరిమితమైంది. దీంతో ఆమె సినీ ఇండస్ట్రీపై విమర్శలు ఎక్కుపెట్టారు. 
 
చిత్ర పరిశ్రమ చాలా క్రూరమైనదంటూ పేర్కొంది. ప్రజల్లో పాపులారిటీ ఉంటేనే ఇక్కడ నిలదొక్కుకోగలమని, లేదంటే అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని పేర్కొంది. 'దేవదాసు' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పాపులర్ నటిగా ఎదిగింది. 
 
అయితే, ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురవడంతో అవకాశాలు లేక దాదాపు కనుమరుగైంది. గతంలో ఓసారి దక్షిణాది సినీ పరిశ్రమపైనా ఇలియానా విరుచుకుపడింది. అక్కడి దర్శకులు చాలా మంది తనను గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం చేశారని ఆడిపోసుకుంది.