శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (18:44 IST)

#NelloreKurollu ఇరగదీశారుగా.. #VakeelSaab ఫైట్ అదుర్స్.. వీడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే యూత్‌లో యమా క్రేజ్. ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం రాజకీయాల్లో వుంటూనే సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని.. వకీల్ సాబ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు పవన్. ఈ సినిమా ఆయన ఫ్యాన్సునే కాదు.. సినీ ప్రేక్షకులను కూడా అలరించింది. ఇక ఆయన ఫ్యాన్స్ అయితే ఈ చిత్రంలోని పాటలకు డ్యాన్సులు, డైలాగులను అనుకరించారు. అంతేకాకుండా.. ఫైట్ సీన్సును కూడా ఫాలో అయ్యారు.  
 
తాజాగా ‘వకీల్‌సాబ్‌’ సినిమాలోని ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ని రీక్రియేట్‌ చేస్తూ నెల్లూరుకు చెందిన కొంతమంది కుర్రాళ్లు ఓ వీడియో రూపొందించారు. సినిమాలో చూపించిన దానికి ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్ సీన్స్ ఎంతో పవర్‌ఫుల్‌గా షూట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సంగీత దర్శకుడు తమన్​తో పాటు పలువురు నెటిజన్లు.. ‘కుర్రాళ్లు ఇరగదీశారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ కుర్రాళ్లు గ‌తంలో కూడా ప‌లు సినిమాల్లోని యాక్ష‌న్ సీన్లను అద్భుతంగా రీ క్రియేట్ చేసి అంద‌రినీ ఆకట్టుకున్నారు. 
 
ఇకపోతే.. పవన్‌ను మాస్ లుక్‌లో చూపించారు.. వేణు శ్రీ రామ్. సినిమాలోని విజువల్స్‌తోపాటు తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ అద‌ర‌హో అనిపించింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు.  ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ సినిమా రికార్డు రేంజ్‌లో క‌లెక్ష‌న్లు రాబట్టింది. నివేధా థామస్‌, అంజలి, అనన్యా పాండే కీలకపాత్రలు పోషించారు.