శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (17:41 IST)

వేశ్యగా కనిపించనున్న ఐశ్వర్యారాయ్..? అభిషేక్ సర్‌ప్రైజ్‌..? తల్లి కాబోతోందా?

అందాల రాశి ఐశ్వర్యారాయ్ వేశ్యగా కనిపించనుందట. బాలీవుడ్‌లో అగ్రహీరోయిన్లలో ఒకరైన ఐష్.. పెళ్లైన తర్వాత కూడా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తోంది. తాజాగా మరో ఛాలెంజింగ్ రోల్ కోసం సిద్ధం అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ వేశ్య జీవిత నేపథ్యంలో తెరకెక్కించనున్న చిత్రానికి చెందిన కథను ఐష్‌కు చెప్పారట. ఆమెకు కథ బాగా నచ్చేసిందట. 
 
అంతే ఆ సినిమాలో నటించేందుకు ఐశ్వర్యా రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బిటౌన్ వర్గాల సమాచారం. అయితే ముందు ఈ కథకు దీపికా పదుకునే బాగుంటుందని భావించిన ప్రదీప్ కథ చెబితే నో చెప్పడంతో ఐష్‌కు చెప్పాడని సమాచారం. ఇక కథ నచ్చడంతో ఐష్ ఈ సినిమాలో వేశ్యగా నటించేందుకు ఓకే చెప్పిందని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
అయితే ఐశ్వర్యా రాయ్ రెండో సారి గర్భం దాల్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు అభిషేక్ బచ్చన్ చేసిన ట్వీటే కారణం. ఐష్ భర్త, నటుడు, అమితాబ్ కుమారుడు అభిషేక్.. అందరికీ సర్ ప్రైజ్ వుందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ రాగానే ఐష్ ఫ్యాన్స్ చర్చ మొదలెట్టారు. ఐష్ రెండో బిడ్డకు తల్లి కాబోతోందని.. అదే సర్‌ప్రైజ్ అంటూ చర్చించుకుంటారు. ఈ సర్ ప్రైజ్ ఏ విషయంపై అనేది నెటిజన్ల మధ్య వైరలయ్యే చర్చ సాగుతోంది.