Festival Posters
✕

అందానికీ, అసభ్యతకీ చిన్న గీత మాత్రమే అడ్డు.. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే తప్పేంటి?: రష్మీ

జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ వెండితెర మీద కూడా మెరుస్తుంది. ఈ బ్యూటీ తన మొదటి సినిమా ''గుంటూరు టాకీస్'' తోనే విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ మూవీలో రష్మీ తన

Written By chitra
Updated: మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (16:36 IST)
జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ వెండితెర మీద కూడా మెరుస్తుంది. ఈ బ్యూటీ తన మొదటి సినిమా ''గుంటూరు టాకీస్'' తోనే విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ మూవీలో రష్మీ తన అందాలను తెగ చూపించేసింది. చూపించింది అనేకన్నా.. రెచ్చగొట్టింది అనడంలో అతిశయోక్తి లేదేమో. అంతే కాకుండా లిప్ లాక్ సీన్స్ కూడ తన మొదటి మూవీతోనే చేయటం అనేది రష్మీ తీసుకున్న డేరింగ్ డెసిషన్. 
 
సినిమా ఎలా ఉన్నా ర‌ష్మీ గ్లామ‌ర్‌కి మాత్రం ఎక్కువ మార్కులు వ‌చ్చాయి. ''గుంటూరు టాకీస్'' చిత్రంలో గ్లామర్ పెంచినందుకు తను చెప్పుకున్న కామెంట్ అందరినీ అబ్బురపరిచింది. గ్లామర్ డోస్ ఎక్కువైందని అనిపించినా, పాత్రపరంగా సహజమేనని అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. గ్లామర్ హీరోయిన్‌గా తనకు మంచి పేరు రావటం అనేది మంచిదే అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. పైగా దానిపై  పలు వివరణలు కూడా ఇచ్చింది. 
 
''నాకున్న అందాన్నిఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే తప్పేంటి'' అని ఈ హాట్‌ యాంకర్‌ అంటోంది. సినిమాలంటేనే గ్లామర్‌ ప్రపంచం. ఆ గ్లామర్‌ ప్రపంచంలో అందం కాకుండా వేరేదైనా ఉంటుందా? కాకపోతే హీరోయిన్లను అందంగా చూపిస్తేనే ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారు. అందంగా చూపించడం, కనిపించడం తప్పంటే ఎలా? అంటూ మండిపడుతోంది. తన అందాన్ని తెర మీద చూపించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ, కొందరు దీన్ని మిస్‌ యూజ్‌ చేస్తున్నారని వాపోతోంది. 
 
అందానికీ, అసభ్యతకీ చిన్న గీత మాత్రమే అడ్డు, ఈ విషయం నాకు బాగా తెలుసు అని తన మనసులోని మాటను బయటపెట్టింది. త‌మిళంలో ఆమె చేసిన ఒక రొమాంటిక్ ల‌వ్ స్టోరీ త్వ‌ర‌లో తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి ''బ‌ల‌పం ప‌ట్టి భామ ఒళ్లో'' అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. ఇందులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు భాగ్య‌రాజా కుమారుడు శంత‌న్ హీరోగా న‌టించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అన్నీ చూడండి

వైఎస్సార్ మరణం తర్వాత సీఎం పదవి కోసం జగన్ డిమాండ్ చేసారు: విజయసాయి రెడ్డి

జాతీయ పాల దినోత్సవం: భారతదేశ తదుపరి శ్వేత విప్లవం పశుపోషణతోనే ప్రారంభం కావాలి, ఎందుకు?

పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మహిళా కార్యకర్తలు.. కారం పొడి ప్యాకెట్లను జేబుల్లో లేదా చీరల్లో ఉంచుకోండి..

మీరట్ హోటల్‌లో యువతిపై లైంగిక దాడి: పోలీసుల అదుపులో నిందితుడు సల్మాన్

మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్... సమస్య నోటితో చెబితే ఎఫ్ఐఆర్ కాపీ సిద్ధం.. ఎక్కడ?

అన్నీ చూడండి

నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కే

విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments