గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (14:05 IST)

నాకు నటన మాత్రమే తెలుసనుకోవద్దు.. అవకాశాలు తగ్గట్లేదు: శ్రుతిహాసన్

సినీ లెజండ్ కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్‌ నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసినా.. గ్లామర్ పరంగా దూసుకెళ్తున్నా.. పెద్ద ప్రాజెక్టులు ఆమెను వరించట్లేదని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. సక్సెస్‌లు వచ్చినా

సినీ లెజండ్ కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్‌ నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసినా.. గ్లామర్ పరంగా దూసుకెళ్తున్నా.. పెద్ద ప్రాజెక్టులు ఆమెను వరించట్లేదని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. సక్సెస్‌లు వచ్చినా పెద్దగా ఉపయోగించుకునేందుకు శ్రుతిహాసన్ ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యంలో అమ్మడుకి ఛాన్సులు బాగా తగ్గిపోయాయని.. నిర్మాతలు, దర్శకులు ఆమెను పక్కనపెట్టేశారని టాక్ వస్తోంది. 
 
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శ్రుతిహాసన్‌కు మంచి క్రేజున్నప్పటికీ.. ఈ మధ్య అవకాశాలు మాత్రం ఆమెకు తగ్గిపోతున్నాయని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో తనకు అవకాశాలు తగ్గలేదని.. తాను కూడా అవకాశాలను తగ్గించుకోనూ లేదంటూ సమాధానమిచ్చింది. సినిమాకు సినిమా కొంత గ్యాప్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అవకాశాలు రావేమోనని భయపడట్లేదని.. నటన వరకే తనకు తెలుసునని అనుకోవద్దన్నారు.