సినీ కెరీర్‌లో మగరాయుళ్ళ వేధింపులు సహజమే : కృతిసనన్
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని రకాల వేధింపులు, ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిందేనని బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌ను సీరియస్‌గా తీసుకోరాదన్నారు
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని రకాల వేధింపులు, ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిందేనని బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌ను సీరియస్‌గా తీసుకోరాదన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో "వన్..నేనొక్కడినే" అనే మూవీతో అడుగుపెట్టింది. ఈ హీరోయిన్ నటించిన 'బరేలి కి బర్ఫీ' సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోగా.. 'రాబ్తా' సినిమా ప్లాప్‌ను మూటగట్టుకుంది. దీనిపై ఆమె స్పందిస్తూ సినీ కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్లు సహజమేనంటోంది.
అదేసమయంలో "సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ చాలా సులభంగా వస్తాయని, మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతే సరిపోతుంది. బాక్సాపీస్ వద్ద వచ్చే ఫలితాలను పట్టించుకోనని చెప్పారు.
ఎందుకంటే అవి మన చేతుల్లో ఉండే విషయాలు కావు. నేను ముంబైకి వచ్చినపుడు.. చాలా సెక్యూర్‌గా, ఫ్యాషనేట్‌గా ఉన్నా. నిరాశను ఎపుడూ దగ్గరికి రానీయలేదు. ఏదైనా విషయంపై ఫోకస్ పెడితే.. మరో దానివైపు వెళ్లకూడదు. నేను చదువుకున్న డిగ్రీ నాకు ఆత్మవిశ్వాసాన్ని, భద్రతను అందించిందని' కృతిసనన్ చెప్పకొచ్చింది.