ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (14:23 IST)

'లింగా'తో కోలీవుడ్‌పై దృష్టి పెట్టిన జగపతిబాబు!

తెలుగు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన జగపతిబాబు ఇపుడు విలన్ జోన్‌లోకి మారినప్పటికీ.. తనను వెతుక్కుంటూ వచ్చే ప్రతి పాత్రలో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ కోవలోనే 'లెజెండ్' చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన జగపతిబాబు.. ఇపుడు 'లింగా' తమిళ సినిమాలో ఆఫర్ రావడంతో దానిని సద్వినియోగం చేసుకుంటున్నారు. పైపెచ్చు, జగపతి ఇప్పుడు తమిళ సినిమాపై కన్నేశాడు కూడా!
 
రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ సినిమా ద్వారా తమిళతెరకి విలన్‌గా పరిచయం కావడాన్ని ఓ సువర్ణావకాశంగా భావించాడు. దీంతో కోలీవుడ్‌లో తనకి ఓ చక్కని ప్లాట్ ఫామ్ ఏర్పడుతుందని నమ్మకంగా వున్నాడు. 'లింగా'లో తను రాజకీయనాయకుడిగా చాలా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. ఇది తనకు మంచి పేరు తేవడమే కాకుండా అజిత్, విజయ్ వంటి హీరోల సినిమాలలో విలన్‌గా ఆఫర్లు కూడా తెస్తుందని ఆశలు పెట్టుకున్నాడు.