శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (18:27 IST)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

rape
తనను ప్రేమించడం లేదనే కసితో మృగంగా మారిన యువకుడు యువతి నోట్లో యాసిడ్ పోయడమే కాకుండా ఆమె తలపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తన ప్రేమను అంగీకరించకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకోబోతోందని తెలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లాలో గణేష్ అనే కామాంధుడు మృగంలా మారాడు. తనకు కాకుండా పోతుందన్న కసితో యువతి నోట్లో యాసిడ్ పోసాడు. ఆమె తలపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆ గాయాలతో బాధితురాలు విలవిలలాడుతుండగా ఆమెపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
 
తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఐతే ఆమె పరిస్థితి విషమంగా వుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. హోంమంత్రి అనిత బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.