ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 జులై 2017 (11:45 IST)

ఆ ముగ్గురు హీరోలంటేనే అమితమైన ఇష్టమంటున్న కాజల్ అగర్వాల్!

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్. మీడియా అడిగే ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా ఠక్కున సమాధానమిస్తుంది. ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలకైనా సరే బదులిస్తుంది. కోలీవుడ్‌లో మీకు నచ్చిన హీరోలు అని విలేకరులు అ

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్. మీడియా అడిగే ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా ఠక్కున సమాధానమిస్తుంది. ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలకైనా సరే బదులిస్తుంది. కోలీవుడ్‌లో మీకు నచ్చిన హీరోలు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కాజల్ సమాధానమిచ్చింది.
 
తనకి సంబంధించినంత వరకూ సూర్య, అజిత్, విజయ్‌లతో కలిసి నటించడం తన అదృష్టమన్నారు. పాత్రలో ఒదిగిపోవడంపైనే సూర్య దృష్టి పెడతాడనీ.. సీన్‌పర్ఫెక్ట్‌గా రావడానికి ఆయన పడే తాపత్రయం తనకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంది. అజిత్ విషయానికి వస్తే.. ఆయన ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వడనీ.. తనని ఇతరులు అనుసరించేలా ప్రవర్తించడం ఆయన ప్రత్యేకత అని చెప్పింది.
 
ఇక నటన పట్ల విజయ్‌కి గల అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేమన్నారు. జయాపజయాలను సమానంగా స్వీకరించడం ఆయన ప్రత్యేకతన్నారు. ఈ ముగ్గురి నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకోగలిగానని చెప్పుకొచ్చింది. ఇక్కడ గమనించాల్సిన సంగతేంటంటే టాలీవుడ్ హీరోల గురించి ఈ అమ్మ‌డు ఒక్క మాట కూడా మాట్లాడ‌కపోవ‌డం గమనార్హం.