శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2016 (09:03 IST)

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాహం... ఇంకా పలువురు భామలు...

2016 సవంత్సరానికి గుడ్‌బై చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమైపోయారు. 2017 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, 2016 సంవత్సరం బాలీవుడ్‌కు మాత్రం విడాకులు, బ్రేకప్‌లతో గడిచి

2016 సవంత్సరానికి గుడ్‌బై చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమైపోయారు. 2017 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, 2016 సంవత్సరం బాలీవుడ్‌కు మాత్రం విడాకులు, బ్రేకప్‌లతో గడిచిపోయింది. 
 
కానీ, వచ్చే యేడాది 2017 మాత్రం ఆశాజనకంగా కనబడుతోంది. పలువురు సినీ స్టార్స్ వచ్చే యేడాది పెళ్లి చేసుకోబోతున్నట్టు స్పష్టం చేస్తున్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ కూడా చేరడం విశేషం.
 
2016లో కంగనా - హృతిక్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. హృతిక్ రోషన్‌తో బ్రేకప్ తర్వాత కంగానా మనసు పెళ్లిపై మళ్లుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే, క్వీన్ ఉన్నట్టుండి షాకిచ్చింది. 
 
వచ్చే యేడాది ప్లానింగ్స్‌లో పెళ్లి కూడా ఉందా? అని అడిగితే.. ఉండొచ్చని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అయితే, ఆ లక్కీ ఫెలో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. చూస్తుంటే.. బాలీవుడ్‌లో అనుష్క శర్మ, సోనాక్షి, కంగనా, సోనమ్.. తదితరులు పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.