పవన్ కళ్యాణ్ పేరుతో కాపు సంఘం మీటింగ్- రాలేనన్న మారుతీ
పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు ఈరోజే. సెప్టెంబర్ 2వతేదీ గురువారం. గతంలో అయితే పవన్ అభిమానులు ఏవో సేవా కార్యక్రమాలు చేస్తుండేవారు. కానీ ఈసారి ఆయన పుట్టినరోజునాడు తమ భవిష్యత్ ప్రణాళికలు ఏమి చేస్తున్నామనేందుకు కాపుసంఘం సభను హైదరాబాద్ ప్రపసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు. ముందుగా ఆహ్వానం సినీప్రముఖులకు తమ కాపుసంఘం ప్రతినిధులకు పంపారు. అందులో దర్శకుడు మారుతీ తదితరులు వస్తున్నారనీ, కాపు సంఘం నాయకుడు స్వామినాయుడు కూడా హాజరవుతున్నారని ప్రకటించారు. అది సినీ పరిశ్రమలో విమర్శలకు గురైంది. కాపుసంఘం మీటింగ్ అని ఎప్పుడూలేనిదీ ప్రత్యేకంగా పెట్టడంపై కొందరు ఆశ్చర్యం వక్తం చేశారు.
సినిమాలపరంగా మెగాస్టార్ ఫ్యామిలీ హీరోలు కులం మీద సినిమాలు తీస్తూ, చివర్లో నీతి చెబుతుంటారు. అందరూ ఒకే కులం అనేలా కథలు రాసుకుంటారు. గతంలోని సినిమాల నుంచి ఉప్పెన సినిమా వరకు అన్నీ అలాంటివే. కానీ అసలు విషయానికి వచ్చేసరికి అంతా కాపుసంఘం వారినే తమతమ సినిమాల్లోనూ తమ తమ కార్యాలయాల్లోనూ తీసుకుంటుంటారు.
ఇదిలా వుండగా, కాపు సంఘం మీటింగ్‌కు మారుతీ, నాయుడు పేర్లు ఆహ్వానపత్రికలో పేర్కొనడంతో వారంతా తాము రాలేమనీ, తమకు వేరే పనులున్నాయనీ, ఔట్ ఆఫ్ స్టేషన్ అంటూ ఒకరోజు ముందు వారంతా వెల్లడించారు. దాంతో తాము చేసింది తప్పని తెలుసుకున్న నిర్వాహకులు ఇది కాపుసంఘం సభ కాదు. కేవలం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నట్లు ఆహ్వానంలో తిరిగి పొందుపరిచారు. సో. సినిమా దర్శక నిర్మాతలు, నటీనటులు ఒకే కులం మీద ముద్ర వేసుకుంటే కొంతవరకు పర్వాలేదు. లాంగ్ రన్‌లో వారి కెరీర్‌కు మైనస్. అందుకే లైమ్‌లైట్‌లో వుండే సినీ ప్రముఖులు హాజరుకాలేదు. ప్రస్తుతం సినిమాలు లేక ఖాలీగా వున్న హరి రామ జోగయ్య, అడ్డాలచంటీ వంటి సినీ ప్రముఖులే హాజరయ్యారని సభకు వచ్చిన వారు అనుకోవడం విశేషం.