పబ్‌లోకి పదేళ్ల చిన్నారి.. డ్యాన్స్ వీడియో వైరల్
కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు మూతపడిన బార్లు, పబ్స్ ప్రస్తుతం మళ్లీ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం.. పబ్స్, బార్లు నడుస్తున్నాయి.
అయితే కొన్ని పబ్‌లు ఈ రూల్స్‌ను అస్సలు పాటించడం లేదు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని లాల్ స్ట్రీట్ పబ్ నిబంధనలను తుంగలో తొక్కింది.
నిబంధనలను పాటించకుండా పదేళ్ల చిన్నారిని పబ్‌లోకి అనుమతించింది. పబ్‌లో చిన్నారి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో కాస్త… పోలీసులు కంట పడింది. దీంతో లాల్ స్ట్రీట్ పబ్ యాజమాన్యానికి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మాదాపూర్ ఏసీపీ, సీఐలను డీసీపీ ఆదేశించారు. ఇక కాసేపటి క్రితమే… లాల్ స్ట్రీట్ పబ్ దగ్గరికి గచ్చిబౌలి పోలీసులు వెళ్లారు. ఈ ఘటన పై విచారణ చేపడుతున్నారు.