సినీ ఛాన్సుల కోసం చెల్లితో పార్టీలకు పబ్బులకు తిరుగుతున్న కృతి సనన్?
కృతి సనన్ గుర్తుందా… మహేష్ బాబు సరసన ''1 – నేనొక్కడినే'' సినిమా ద్వారా టాలీవుడ్ ప్రవేశం చేసిన ఈ ఢిల్లీ భామ టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేక పోయింది. కొద్దికాలం విరామం తర్వాత నాగ చైతన్యతో చేసిన ''దోచెయ్'' కూడా పరాజయం కావడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాల రావడంతో ఈ భామ అక్కడ మకాం వేసింది.
తాజాగా తన చెల్లెలు ''నుపుర్''ని హీరోయిన్ చేయడానికి ప్రయత్నిస్తుందట. ఇందుకోసం కృతి సనన్ బాగానే కష్టపడుతోందట. వెంటనే చెల్లిని ఢిల్లీ నుంచి ముంబైకి రప్పించిందట. ప్రస్తుతం వీరిద్దరు ఇక్కడే ఉంటున్నారట. ఇప్పటికే తన చెల్లెలిని అందరి దృష్టిలో పడేసేందుకు పార్టీలు పబ్బులకి తిప్పుతోందట. కాలేజ్‌డేస్‌లోనే మోడలింగ్ చేసిన నుపుర్ అక్కతో పాటే ఇప్పుడు అవకాశాలు కోసం ఎదురుచూస్తుందోట. కృతిసనన్ మేనజర్ ఈ వ్యవహారలన్నింటిని దగ్గరుండి చూస్తున్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
గతంలో చాలామంది హీరోయిన్లు తమ సోదరిలను హీరోయిన్‌గా చేయడానికి ప్రయత్నించడం ఎప్పటినుంచో మనకు తెలిసిన విషయమే. ఈ కోవలో అలనాటి హీరోయిన్లు అంభిక-రాధ, రాధిక-నిరోషా, భానుప్రియ-శాంతిప్రియలతో, ఈ తరంలో ఆర్తి అగర్వాల్-అదితి అగర్వాల్, కాజల్ అగర్వాల్- నిషా అగర్వాల్, సంజన-నిక్కీ గల్రాని మొదలైన వాళ్ళంతా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన విజయవంతం కాలేకపోయారు. ఇప్పుడు కృతి సనన్ చెల్లెలు నుపుర్ పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాల్సిందే.