ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2016 (10:45 IST)

నాకు కాబోయే భర్త నాకు క్షమాపణ చెప్పాలి లేకుంటే..?: లిండ్సే లోహన్

అమెరికాకు చెందిన నటి, మోడల్, సింగర్ లిండ్సే లోహన్ మరో సారి సంచలన వాఖ్యలు చేసింది. తనకు కాబోయే భర్త తనకు క్షమాపణ చెప్పాలని ఈమె పట్టుబడుతోంది. ఇటీవలే ఈమెకు రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఈగోర్ తారాబసోవ్‌తో

అమెరికాకు చెందిన నటి, మోడల్, సింగర్ లిండ్సే లోహన్ మరో సారి సంచలన వాఖ్యలు చేసింది. తనకు కాబోయే భర్త తనకు క్షమాపణ చెప్పాలని ఈమె పట్టుబడుతోంది. ఇటీవలే ఈమెకు రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఈగోర్ తారాబసోవ్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే గత నెలలో ఏదో విషయమై ఇద్దరు గొడవపడ్డారు. వీరిద్దరు మిక్‌నాస్‌లోని బీచ్‌లో అందరి చూస్తుండగానే దూషించుకున్నారు. 
 
గొడవ జరిగినప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. తనకు కాబోయే భర్త ఈగర్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలని లోహన్ చెప్పింది. తప్పు తెలుసుకుని మళ్లీ తన దగ్గరకు రావాలన్న ఉద్దేశంతోనే ఆమె తన ఎంగేజ్ మెంట్ రింగ్‌ను చేతి నుంచి తీయడం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను పోస్ట్ చేసింది. 
 
ఎప్పటికప్పుడూ తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో కనిపించే ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ ఉంటోంది. ఆ ఫోటో కింద నో బాయ్ ఫ్రెండ్, స్టిల్ నీడ్ సారీ అని క్యాప్షన్ పెట్టి తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంది. ఈ అమ్మడు తారాబసోవ్‌తో ప్రేమాయణం గురించి మీడియాలో తన ఇంటర్వ్యూకు‌గానూ రూ.4 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.