బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: గురువారం, 28 జూన్ 2018 (20:59 IST)

నిర్మాత‌గా భారీ ప్లాన్‌తో వ‌స్తున్న 'మహానటి', 'ఎన్టీఆర్ బయోపిక్' స్టార్ రైట‌ర్..!

త‌న ప‌దునైన మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప చేస్తూ... అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న స్టార్ రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా. ఎన్నో స‌క్స‌స్‌ఫుల్ మూవీస్‌కి సంభాష‌ణ‌లు అందించిన సాయిమాధ‌వ్ ఇటీవ‌ల మ‌హాన‌టి సినిమాకి రాసిన డైలాగ్స్‌తో మ‌రోసారి శ‌భాష

త‌న ప‌దునైన మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప చేస్తూ... అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న స్టార్ రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా. ఎన్నో స‌క్స‌స్‌ఫుల్ మూవీస్‌కి సంభాష‌ణ‌లు అందించిన సాయిమాధ‌వ్ ఇటీవ‌ల మ‌హాన‌టి సినిమాకి రాసిన డైలాగ్స్‌తో మ‌రోసారి శ‌భాష్ అనిపించుకున్నాడు. ప్ర‌స్తుతం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి సంభాష‌ణ‌లు రాస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ స్టార్ రైట‌ర్ నిర్మాత‌గా మార‌బోతున్నాడు.
 
నిర్మాత‌గా వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ త‌ర్వాత సినిమాల‌ను కూడా నిర్మించాలి అనుకుంటున్నాడ‌ట‌. ఇప్ప‌టికే షార్ట్ ఫిల్మ్స్ కోసం కొన్ని క‌థ‌లు కూడా రెడీ చేసాడ‌ట‌. నిర్మాత‌గా మార‌డ‌మే కాకుండా ద‌ర్శ‌కుడిగా కూడా మారాలి అనుకుంటున్నాడ‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే మెగా ఫోన్ ప‌ట్టుకోవ‌డం కోసం అద్భుత‌మైన క‌థ‌ను రెడీ చేసుకున్నాడ‌ట‌. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాడ‌ని స‌మ‌చారం.