శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 6 జూన్ 2017 (20:09 IST)

'భరత్ అను నేను'... పిల్లిగడ్డంతో మహేష్ బాబు... షాకింగ్?

మహేష్ బాబు అనగానే నున్నగా షేవ్ చేసుకుని, ఎట్టి పరిస్థితుల్లో బాడీని చూపించకుండా చక్కగా దుస్తులు వేసుకుని కనిపిస్తుంటాడు. ఐతే శ్రీమంతుడు చిత్రంలో పల్లెటూరిలో కుర్రాడులా వుండాలంటే లుంగీ తప్పదని దర్శకుడు చెబితే... అబ్బే అంటూ తెగ సిగ్గుపడుతూ చివరికి లుంగ

మహేష్ బాబు అనగానే నున్నగా షేవ్ చేసుకుని, ఎట్టి పరిస్థితుల్లో బాడీని చూపించకుండా చక్కగా దుస్తులు వేసుకుని కనిపిస్తుంటాడు. ఐతే శ్రీమంతుడు చిత్రంలో పల్లెటూరిలో కుర్రాడులా వుండాలంటే లుంగీ తప్పదని దర్శకుడు చెబితే... అబ్బే అంటూ తెగ సిగ్గుపడుతూ చివరికి లుంగీ కట్టాడట మహేష్ బాబు. 
 
లుంగీ కట్టేందుకే అంత ఫీలయ్యే మహేష్ బాబు తన తదుపరి చిత్రం... 'భరత్ అను నేను'లో పిల్లిగడ్డంతో కనిపించబోతున్నాడట. ఈ వార్త ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. స్పైడర్ మూవీ చేస్తున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ చిత్రం పూర్తిగా పొలిటికల్ టచ్ తో వుంటుందని అంటున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.