గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 1 జూన్ 2017 (18:50 IST)

మహేష్ బాబుకు రాజమౌళి ఫీవర్... జక్కన్నను కలిస్తే ఆ మాటన్నాడట...

మహేష్‌ బాబు చిన్నతనం నుంచి నటనలో తనదైన శైలిలో రాణిస్తున్న హీరో. యువ కథనాయకుల్లో మహేష్ బాబుకు ప్రత్యేక స్థానం ఉంది. డైలాగ్‌లు చెప్పడంలో కానీ, ఫైటింగ్ సీన్స్‌లో గాని, ప్రతి సన్నివేశాన్ని పండించడంలో గాని మహేష్‌ బాబుకు మంచి పేరుంది.

తండ్రి ఘట్టమనేని క్రిష్ణ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మహేష్‌ ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీల్లో నటించాడు. మాస్ హీరోగా మహేష్ బాబును తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో మహేష్ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. అందుకే ఆ హీరో కూడా ఒక అతిపెద్ద దర్శకుడు వెనుక పడ్డాడు. ఆయనే రాజమౌళి. 
 
యువ కథానాయకులందరికీ ఇప్పుడు రాజమౌళి ఫీవర్ పట్టుకుంది. ఎన్‌టిఆర్ నుంచి మహేష్ వరకు చాలామంది యువ కథానాయకులు రాజమౌళిని సినిమాలు తీయమని వెంట పడుతున్నారు. భారీ బడ్జెట్‌తో ఇప్పటికే జూనియర్ ఎన్‌టిఆర్‌కు హామీ ఇచ్చిన రాజమౌళి.. మహేష్ బాబుకు కూడా అభయహస్తమిచ్చాడట. 
 
వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తీద్దామని.. కథను కూడా సిద్ధం చేద్దామని చెప్పాడట. తనకు మైలేజ్ వచ్చే విధంగా కథ ఉండాలని మహేష్‌ రాజమౌళిని కోరినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రాజమౌళి వెనుకబడే యువ కథానాయకుల సంఖ్య పెరుగుతోందని సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.