మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (17:31 IST)

ఐటెం సాంగ్‌కు మిల్కీ బ్యూటీ తమన్నా భారీ డిమాండ్‌!

Tamanna Bhatia
ఈమ‌ధ్య హీరోయిన్లే ఐటం గాల్స్‌గా మారిపోయారు. ఇటీవ‌లే బంగార్రాజు సినిమాలో జాతి ర‌త్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా అల‌రించింది. ఇందుకు ప‌రిమితంగానే ముట్ట‌చెప్పార‌ని తెలిసింది. కానీ సీనియ‌ర్ న‌టి స‌మంత‌కు పుష్ప‌లో కోటి 25ల‌క్ష‌లు ఐటం సాంగ్‌కు ముట్టాయ‌ని టాక్‌. ఇక ఇప్పుడు తెల్లటి పాల అందాల రాణి త‌మ‌న్నా భాటియాకు కోటి రూపాయ‌లు ఐటం సాంగ్‌కు తీసుకున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. చిత్ర‌మేమంటే స‌మంత‌, త‌మ‌న్నా ఇద్ద‌రూ అర‌వింద్ సినిమాల‌లోనే చేయ‌డం విశేషం.
 
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా `గని`. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా ఐటం సాంగ్ చేసారు. ఈ మధ్యే విడుదలైన పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు. హారిక నారాయణ్ పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. తమన్నా అందచందాలు పాటకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయ‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది.