శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 జులై 2017 (15:03 IST)

బిగ్ బాస్‌లో గాయత్రి నోట "స్లమ్'' మాట: కమల్‌కు రూ.100 కోట్ల కేసు

తమిళ బిగ్ బాస్ రోజుకో కొత్త వివాదాన్ని కొనితెస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్‌తో లేనిపోని కష్టాలు ఎదుర్కొంటున్న సినీ లెజెండ్ కమల్ హాసన్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. ఇప్పటికే బిగ్ బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరి

తమిళ బిగ్ బాస్ రోజుకో కొత్త వివాదాన్ని కొనితెస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్‌తో లేనిపోని కష్టాలు ఎదుర్కొంటున్న సినీ లెజెండ్ కమల్ హాసన్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. ఇప్పటికే బిగ్ బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్‌ హాసన్‌పై హిందూ మక్కల్ కట్చి కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపే విధంగా బిగ్ బాస్ వుందంటూ హిందూ మక్కల్ కట్చి కమల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది తాజాగా పుథియ తమిళగం పార్టీ నేత కృష్ణస్వామి కమల్‌పై రూ.వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కమల్‌ హాసన్‌తో పాటు బిగ్ బాస్ కార్యక్రమంలో  పాల్గొనే ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటీమణి గాయత్రి రఘురామ్‌ తదితరులపై పరువు నష్టం దావా వేసినట్లు సమాచారం. 
 
బిగ్ బాస్ షోలో ఓ ఎపిసోడ్‌లో గాయత్రి రఘురామ్‌ మరో నటి ప్రవర్తనను ''స్లమ్ బిహేవియర్'' (మురికివాడల్లో నివసించేవారిలా ఆ ప్రవర్తన ఏంటి) అని కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. గాయత్రీ చేసిన వ్యాఖ్యలు మురికివాడల్లో నివసించే ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లున్నాయని కృష్ణస్వామి అన్నారు.

ఈ కార్యక్రమానికి హోస్ట్‌‍గా ఉన్న కమల్ హాసన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు వంతపాడుతున్నారని విమర్శించారు. అంతేగాకుండా మరో వారం రోజుల్లోగా కమల్‌హాసన్‌ క్షమాపణలు చెప్పాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.