శనివారం, 1 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (15:40 IST)

అమ్మాయిలను మోసం చేస్తున్న సుడిగాలి సుధీర్... నిలదీసిన రోజా?

యాంకర్ రష్మి చిట్టిపొట్టి డ్రెస్సులతో జబర్దస్త్ కామెడీను హీటెక్కించింది. అదేసమయంలో ఆమెకు, జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఇంకోవ

యాంకర్ రష్మి చిట్టిపొట్టి డ్రెస్సులతో జబర్దస్త్ కామెడీను హీటెక్కించింది. అదేసమయంలో ఆమెకు, జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఇంకోవైపు సుడిగాలి సుధీర్ ఇప్పుడిప్పుడే మంచి ఫామ్‌లోకి వస్తున్నాడు. సినిమాల్లో కూడా చాన్సులు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. సినిమాలతోనే కాదు అమ్మాయిలను తన అందంతో ఆకట్టుకోవడంలో కూడా ముందు వరుసలో ఉన్నాడు. 
 
ఈ పరిస్థితుల్లో జబర్దస్త్ జడ్జి రోజాకు అడ్డంగా దొరికిపోయాడు. జబర్దస్త్ ఫేం చంటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమానికి నాగబాబు, రోజా జడ్జిలుగా వచ్చారు. అయితే ఈ షోలో ఎవరికైనా కాల్ చేసి వాళ్ళను బకరాలను చేయాలి. ఇంకేముంది రోజా సుడిగాలి సుధీర్‌కు కాల్ చేసి నువ్వొక అమ్మాయిని మోసం చేసావని నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిందని.. ఏంటీ విషయం అని సుధీర్‌ని నిలదీసింది. అంతే ఇక సుధీర్‌కు నోటమాటరాలేదు. ఏం విషయం అని తెలీక చాలా కంగారుపడ్డాడు. 
 
ముఖమంతా చెమటలతో... మేడం... మేడం... అంటూ రోజాను బ్రతిమిలాడటం మొదలు పెట్టాడు. నిజం చెప్పండి మేడం ఎవరు వచ్చారు.. అమ్మాయి పేరేంటీ.. అసలు ఏం చెప్పింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇలా సుధీర్‌ని చాలా టెన్షన్ పెట్టిన రోజా చివరకు.. ఇదంతా ఉత్తుత్తిదే అని చెప్పడంతో మనోడు ఊపిరి పీల్చుకున్నాడు. ఐతే సుధీర్ ఇంతలా కంగారు పడ్డాడంటే ఎంత మంది అమ్మాయిలను మోసం చేస్తున్నాడో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.