బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (16:23 IST)

రాజు గారి గదితో యుద్ధం శరణం పోటీ.. చైతూ వర్సెస్ నాగార్జున ?

అక్కినేని నాగార్జున, సమంత నటించిన రాజు గారి గది 2 సినిమాను కూడా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో... ఆ రోజున రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే అదే రోజున చైతూ సి

అక్కినేని నాగార్జున, సమంత నటించిన రాజు గారి గది 2 సినిమాను కూడా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో... ఆ రోజున రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే అదే రోజున చైతూ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. నాగచైతన్య కథానాయకుడిగా మారి ముత్తు దర్శకత్వంలో 'యుద్ధం శరణం' సినిమా తెరకెక్కింది. 
 
ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో, విలన్‌గా శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఈ సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పటికే చాలా సినిమాలు ఆగస్టులో తమ విడుదల తేదీలను ప్రకటించేశాయి. దాంతో ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందా లేదా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 
 
‘యుద్దం శరణం’ సినిమా డైరెక్టర్ కృష్ణ మరైముత్తుకి ఇదే తొలి సినిమా. మొదటి సినిమా అయినా కూడా ఈ సినిమాను చాల స్టైలిష్‌గా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే టాక్ వచ్చేసింది. పెళ్ళి చూపులు ఫేం వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం ఇవ్వగా.. సాయి కొర్రపాటి నిర్మతగా వ్యవహరిస్తున్నారు.