శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 15 మే 2018 (19:35 IST)

స‌వ్య‌సాచి రిలీజ్ వాయిదా ప‌డిందా..?

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న తాజా చిత్రం స‌వ్య‌సాచి. ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న తాజా చిత్రం స‌వ్య‌సాచి. ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో... మాధ‌వ‌న్, భూమిక చావ్లా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. యు.ఎస్ షెడ్యూల్ త‌ర్వాత‌ హైద‌రాబాద్‌లో ఓ సాంగ్  షూట్ చేయ‌నున్నారు. దీంతో షూటింగ్  పూర్త‌వుతుంది.
 
అయితే... ఈ సినిమాని జూన్ 14న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. కానీ... తాజా స‌మాచారం ప్ర‌కారం ఎనౌన్స్ చేసిన‌ట్టుగా స‌వ్య‌సాచి జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం లేద‌ట‌. ఎందుకంటే... షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. దీనికితోడు జూన్ 14న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సాక్ష్యం రిలీజ్ కానుంది. అందుచేత సాక్ష్యం, స‌వ్య‌సాచి నిర్మాత‌లు రిలీజ్ డేట్ విష‌య‌మై చ‌ర్చించుకున్నార‌ట‌. దీంతో స‌వ్య‌సాచి జూన్ 14న కాకుండా జులైలో రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.