ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (14:56 IST)

మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రం ఖాయం... దర్శకుడు క్రిషే.. రాజమౌళి, త్రివిక్రమ్ నో చెప్పారట..

నందమూరి హీరో, బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో.. దర్శకుడు క్రిష్ తన తదుపరి సినిమాపై కన్నేశాడు. బాలయ్య వందో సినిమాను రూపొందించిన క్రిష్.. ఆయన కుమారుడు, నట సింహ

నందమూరి హీరో, బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో.. దర్శకుడు క్రిష్ తన తదుపరి సినిమాపై కన్నేశాడు. బాలయ్య వందో సినిమాను రూపొందించిన క్రిష్.. ఆయన కుమారుడు, నట సింహం వెండితెర వారసుడు మోక్షజ్ఞను సినీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. 
 
ఇందుకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని మోక్షజ్ఞ సినిమా ఆరంగేట్రాన్ని క్రిష్ చేతికి బాలయ్య అప్పగించినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ తొలి సినిమా రాజమౌళితో త్రివిక్రమ్‌తో ఉంటుందని అందరూ అనుకున్నారు. 
 
అయితే వారిద్దరూ సినిమాల్లో బిజీ బిజీగా ఉండటంతో పాటు, మోక్షజ్ఞ కెరీర్ పరంగా ఆలోచిస్తే రెండో సినిమాకు ఓకే చెప్పారంట. అందుకే క్రిష్‌కే తొలిసినిమా బాధ్యతలను బాలయ్య అప్పగించారట. ముందుగా బాలయ్య బోయపాటిని అనుకున్నా.. ఆపై క్రిష్‌కే ఓటేసి మోక్షజ్ఞ తొలి సినిమాను అతనిచే చేయించాలని డిసైడయ్యాడని సమాచారం. ఇంకేముంది.. గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ తర్వాత.. మోక్షజ్ఞ హీరోగా క్రిష్ డైరెక్షన్‌లో మూవీకి ముహూర్తపు షాట్ పడనుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.