బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 జులై 2017 (16:45 IST)

టాలీవుడ్‌లో డ్రగ్స్ బాబులు... కొత్తగా మందుబాబు నాని షూటింగ్‌కు అలా వచ్చేశాడట...

నాని హీరోగా నటించి, విడుదలైన చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుని విజయవంతంగా ఆడుతోంది. అయితే, ఈ చిత్రంలో నటించేందుకు హీరో నాని ఫుల్‌బాటిల్ మందుకొట్టినట్టు

నాని హీరోగా నటించి, విడుదలైన చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుని విజయవంతంగా ఆడుతోంది. అయితే, ఈ చిత్రంలో నటించేందుకు హీరో నాని ఫుల్‌బాటిల్ మందుకొట్టినట్టు చిత్ర కథా రచయిత కోన వెంకట్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని చిత్రం సక్సెస్ మీట్‌లో వెల్లడించాడు. 
 
ఈ చిత్రం సక్సెస్ మీట్ విజయవాడలో జరిగింది. ఇందులో కోన వెంకట్ మాట్లాడుతూ... 'నిన్ను కోరి' సినిమా సూపర్ హిట్ కావడానికి ప్రేక్షకులే కారణమన్నారు. ఈ సినిమాలో నాని, ఆది, నివేదితలు అద్భుతమైన నటనను కనబరిచారని చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డాడని తెలిపారు. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం నాని ఫుల్ బాటిల్ మందు తాగేశాడని చెప్పారు. 
 
సున్నా డిగ్రీల టెంపరేచర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు, ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు... ఆ సీన్‌ను పండించడానికి నాని నిజంగానే మందు తాగాడని... ఆ సీన్ ఎంతో నేచురల్‌గా వచ్చిందని కొనియాడారు. నాని నేచురల్ స్టార్ అని చెప్పడానికి ఇదో నిదర్శనమని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.