మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 జులై 2017 (14:42 IST)

మెగాస్టార్ అయితే నాకేంటి.. రూ.4 కోట్లు ఇవ్వాల్సిందే... నయనతార

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించేందుకు రూ.4 కోట్లు ఇవ్వాల్సిందేనని, దానికంటే ఒక్క పైసా తగ్గినా తాను అంగీకరించే ప్రసక్తే లేదని తనను సంప్రదించిన వారి వద్ద మలయాళ నటి నయనతార కుండబద్ధలు కొట్టినట

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించేందుకు రూ.4 కోట్లు ఇవ్వాల్సిందేనని, దానికంటే ఒక్క పైసా తగ్గినా తాను అంగీకరించే ప్రసక్తే లేదని తనను సంప్రదించిన వారి వద్ద మలయాళ నటి నయనతార కుండబద్ధలు కొట్టినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
 
ఇటు టాలీవుడ్‌లోనేకాకుండా అంటు కోలీవుడ్, శాండల్‌వుడ్, మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న నటి నయనతార. ఈ క్రేజీ హీరోయిన్ కొంత విరామం తర్వాత మళ్లీ తెలుగు చిత్రాలపై దృష్టిసారించింది. ఇటీవల బాలకృష్ణ చిత్రానికి గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చిన నయన ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించనున్న చిత్రాన్ని కూడా అంగీకరించింది. 
 
అయితే ఈ చిత్రానికి దాదాపు రూ.4 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రతి సినిమాకు రెండు నుంచి రూ.2.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్న నయనతార 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి మాత్రం ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక్కడ ఇమేజ్‌తో పని లేదనీ, రెమ్యునరేషన్ ముఖ్యమని తనను సంప్రదించిన వారివద్ద ఆమె వ్యాఖ్యానించినట్టు వినికిడి. 
 
కాగా, ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్ తన సొంత బ్యానెర్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా మలయాళ, హిందీ భాషల్లో అనువాద రూపంలో విడుదల చేయనున్నారని, ఆ కారణంగానే నాలుగు భాషలకు కలిపి నయనతార నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.