''యే దిల్ హై ముష్కిల్''.. ఐశ్వర్యా - రణ్‌బీర్ హాట్ సన్నివేశాల తొలగింపు
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, రణబీర్ నటిస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ''యే దిల్ హై ముష్కిల్''. కరణ్ జోహార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాకిస్థాన్ సూపర్ స్టార్ ఫహద్ ఖాన్ ఓ ముఖ
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, రణబీర్ నటిస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ''యే దిల్ హై ముష్కిల్''. కరణ్ జోహార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాకిస్థాన్ సూపర్ స్టార్ ఫహద్ ఖాన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ట్రయాంగిల్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రేమికుల భావోద్వేగాలు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్స్‌లోనూ, టీజర్లోనూ లవ్ బ్రేక్‌ను హార్ట్ టచ్చింగ్‌గా డైరెక్టర్ ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా యే దిల్ హై ముష్కిల్ ఫుల్ సాంగ్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటలలోనే 9 లక్షలకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలావుంటే ఇటీవల విడుదలైన 'యే దిల్ హై ముష్కిల్' సినిమా టీజర్ వేడి పుట్టిస్తోంది. యూట్యూబ్‌లో ఈ టీజర్ సంచలనంగా మారింది. అందాల ఐశ్వర్యారాయ్, యువ హీరో రణ్‌బీర్ కపూర్ల మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఐశ్వర్యా అందాలకు తోడు, ఘాటు ముద్దు సన్నివేశాలు కూడా ఉండటంతో ఈ సినిమా పట్ల అంచనాలు భారీగా పెరిగాయి.
టీజరే ఈ రేంజ్లో ఉంటే... సినిమా ఇంకెంత రేంజ్లో ఉంటుందో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'బులెయా' పాటలో హాట్ హాట్‌గా కనిపించిన ఐష్‌ను చూసి సినీ అభిమానులు ఆమె అందాల ఆరబోతకు ఫిదా అయిపోయారు. అయితే, ఈ సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐశ్వర్య, రణ్‌బీర్‌ల మధ్య ఉన్న రొమాంటిక్ సీన్లు శృతి మించాయని సెన్సార్ బోర్డు నో చెప్పింది. సినిమాలో అసభ్యంగా అనిపించిన మూడు సన్నివేశాలను తొలగించి, యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది.
సెన్సార్ బోర్డు నిర్ణయంతో దర్శకుడు కరణ్ జోహార్ షాక్‌కు గురయ్యాడు. ఈ సినిమాకు ఆ మూడు సన్నివేశాలే అత్యంత కీలకమని బోర్డుతో వాదించాడు. అయినా ఫలితం లేకపోయింది. సెన్సార్ బోర్డు ఏ మాత్రం తగ్గలేదు. కరణ్ వాదనను పట్టించుకోని సెన్సార్ బోర్డు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మూడు సన్నివేశాల కట్‌తోనే ''యే దిల్ హై ముష్కిల్’ అక్టోబర్ 28న ''విడుదల కానుండగా మూవీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.