శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (13:55 IST)

ఎన్టీఆర్ బయోపిక్.. బసవతారకం పాత్రలో నిత్యామీనన్?

తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం వెంకటేష్ సినిమాతో బిజీ బిజీగా వున్న తేజ.. ఈ చిత్రం పూర్తికాగానే ఎన్టీఆర్‌ బయోపిక్‌పై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వ

తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం వెంకటేష్ సినిమాతో బిజీ బిజీగా వున్న తేజ.. ఈ చిత్రం పూర్తికాగానే ఎన్టీఆర్‌ బయోపిక్‌పై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ సంబంధించిన పనులు చకచకా సాగిపోతున్నాయి. ఇక ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. 
 
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌లోని సీనియర్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం హీరోయిన్ నిత్యామీనన్‌ను సంప్రదించారట. ఈ పాత్ర కోసం ముందు అంగీకరించిన నిత్యామీనన్ ఆపై చేయనని నిరాకరించిందట. దీంతో చిత్ర యూనిట్ తలపట్టుకుని కూర్చున్నారట. 
 
ఇంకా బసవతారకం పాత్రకు సంబంధించిన ఎంపిక జరగలేదు. ఈ పాత్రలో నటించే అవకాశం ఎవరికి దక్కుతుందోనని ఫిలిమ్‌ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే ఎన్టీఆర్ సన్నిహితులైన అలనాటి నటులు అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై కూడా చర్చ సాగుతోంది.