గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (17:21 IST)

ఫ్యాన్స్ మెచ్చిన ఎన్‌టిఆర్ కొత్త లుక్‌

NTR, new look, Trivikra Srinivas movie
హీరోలు కొత్త‌గా క‌న్పిస్తే చాలు అభిమానులు తెగ మెచ్చుకుంటారు. అందుతో ఏదో కొత్త లుక్‌తో వారు సోష‌ల్ ‌మీడియాలో ఫొటో పెడుతుంటారు. కానీ కొంద‌రు ప్ర‌త్యేకంగా షూటింగ్ గెట‌ప్ క‌న్పించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంటారు. కానీ ఒక్కోసారి లుక్‌లు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. అలాంటిదే ఎన్.జి.ఆర్‌. జూనియ‌ర్ లుక్‌. ప్ర‌స్తుతం ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా లుక్‌లు బ‌య‌ట‌కు విడ‌త‌ల‌వారీగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి విడుద‌ల చేస్తున్నాడు.

కానీ దానిలో క‌న్పించ‌ని కొత్త లుక్‌తో ఎన్‌.టి.ఆర్‌. ఇటీవ‌లే ద‌ర్శ‌న‌మిచ్చాడు. అదికూడా చిరంజీవి అల్లుడు న‌టిస్తున్న `ఉప్పెన‌` సినిమా ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో ఆయ‌న క‌నిపించారు. ఎన్టీయార్ కొత్త లుక్ ఆయన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఎన్టీయార్ స్మార్ట్ లుక్ బాగుందని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీయార్ తర్వాతి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. బ‌హుశా ఆ సినిమా లుక్ అని కామెంట్లు చేస్తున్నారు.