గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2021 (18:34 IST)

uppena trailer: యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్

గత ఏడాది నుంచి పాటలతో ఉర్రూతలూగిస్తున్న ఉప్పెన చిత్రం ట్రెయిలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు. ఈ చిత్రంలో... నీ కళ్లు నీలి సముద్రం అనే పాట ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే.
ఈ చిత్రంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించారు. ప్రతినాయకుడుగా విజయ్ సేతుపతి అదరగొట్టినట్లు తాజా ట్రయిలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్ర ట్రయిలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఉప్పెన వాలెంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదల కాబోతోంది.