మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (12:50 IST)

స్పా మాటున గుట్టుగా వ్యభిచారం.. ఎక్కడ?

ఢిల్లీ నోయిడాలో ఓ స్పా సెంటరులో గుట్టుగా సాగుతూ వచ్చిన వ్యభిచార దందాను పోలీసులు గుర్తించారు. నోయిడా సెక్టారు 18లోని స్పాలో ఉన్న బాలికలు కస్టమర్లతో వ్యభిచారం చేస్తున్నారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో ప్రత్యేక బృందం పోలీసులు ఆ స్పా సెంటరుపై ప్రత్యేక నిఘా వేశారు. ఈ నిఘాలో భాగంగా, ఆ స్పా సెంటరులో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆ సమయంలో స్పా కేంద్రంలో వ్యభిచారం చేస్తున్న 14 మంది బాలికలను బాధితులుగా భావించి వారిని కాపాడామని డీసీపీ చెప్పారు. 
 
స్పా యజమానులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశామని డీసీపీ చెప్పారు. 14మంది బాధిత బాలికలను పునరావాస కేంద్రానికి తరలించినట్లు డీసీపీ చెప్పారు. స్పా మాటున వ్యభిచారం సాగిస్తున్నందున భవన యజమానికి నోటీసు పంపిస్తున్నట్లు డీసీపీ వివరించారు.