శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2020 (10:33 IST)

సెక్స్ రాకెట్‌లో బీజేపీ మహిళా నేత?? పరారీలో కాంగ్రెస్ నేత!

డబ్బు సంపాదన కోసం రాజకీయ నేతలు అడ్డుదారులను ఎంచుకుంటున్నారు. ఇలాంటి అడ్డుదారుల్లో వ్యభిచార దందా ఒకటి. అందమైన అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి దందాలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా నేత ఒకరు కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయం బాధిత బాలికల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఆమె పేరు సునీతా వర్మ. రాజస్థాన్ బీజేపీ మహిళా మోర్చా నేత. ఈమె వర్మ సెక్స్ రాకె‌ట్‌లో చిక్కుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది. సవాయి మాధోపూర్‌లో 17 ఏళ్ల యువతి, వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని, పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయగా, ఈ రాకెట్ బయటపడింది. 
 
మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న సునీత, స్వయంగా ఈ దందాను నడిపిస్తోందని తేల్చిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ విషయం బయటకు రాగానే, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. 
 
ఈ సెక్స్ రాకెట్‌లో భాగం పంచుకున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగినులు, మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసును లోతుగా విచారిస్తున్నారు. ఇంకోవైపు, ఈ కేసుతో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నేత పూనమ్ చౌదరితో పాటు, మరో ఇద్దరికి కూడా ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.