శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2020 (14:20 IST)

ఫిరోజ్‌ఖాన్‌ అరెస్ట్ ఎందుకో తెలుసా?

Feroz khan
కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్‌ను శుక్రవారం సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనుచరులతో కలిసి ఏఎన్‌ఐ రిపోర్టర్‌పై దాడికి పాల్పడిన ఫిరోజ్‌ఖాన్‌ను శుక్రవారం సైఫాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

కింగ్‌ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను కోర్టు ఎదుట హాజరుపరిచారు. గురువారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్‌ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమ కవరేజ్‌ కోసం ఏఎన్‌ఐ రిపోర్టర్‌ వచ్చాడు.
 
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వస్తుండగా రిపోర్టర్‌ అడ్డురావడంతో ఫిరోజ్‌ఖాన్‌ అతడిని తోసేసి తీవ్ర పదజాలంతో దూషించాడు. దీంతో అతడి వైఖరిపై రిపోర్టర్‌ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఆగ్రహించిన ఫిరోజ్‌ఖాన్‌ అనుచరులతో కలిసి అతడిపై దాడి చేశాడు. విషయంపై రిపోర్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిరోజ్‌ఖాన్‌ను అరెస్టు చేశారు.